'రాజకీయ వ్యభిచారులు దేశాన్ని ముక్కలు చేశారు'

'రాజకీయ వ్యభిచారులు దేశాన్ని ముక్కలు చేశారు' - Sakshi


హైదరాబాద్: రాష్ట్ర విభజనలో తమకు న్యాయం చేయని నాయకులపై ప్రజలు తిరగబడి, ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విభజన పాపం అన్ని పార్టీలదీ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు.స్వార్థ రాజకీయనేతలకు ఓటర్లు బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుందని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు వల్లభాయ్ పటేల్, తెలుగు జాతి సమైక్యతకు ఎన్టీఆర్‌లు నిదర్శనమని, ప్రస్తుత రాజకీయ వ్యభిచారులు స్వార్థంతో దేశాన్ని కుక్కలు చించిన విస్తరి చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర భవిష్యత్‌ను సోనియా గాంధీ కాళ్ల ముందు బేరానికి పెట్టారని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top