చిత్తూరు జిల్లా పుంగనూరులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలసి స్థానిక పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలసి స్థానిక పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఉబేదుల్లా కాంపౌండ్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైనా అనుమాతులున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇటీవల చిత్తూరు జిల్లాలోనే పుత్తూరులో ఓ ఇంట్లో తలదాచుకున్న అల్ ఉమా సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదుల్ని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నినట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు పుంగనూరులో గాలింపు చర్యలు చేపట్టడం స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేసింది.