‘అన్నయ్యను అన్యాయంగా చంపేశారు’ | police records statement of YS vivekananda reddy brothers | Sakshi
Sakshi News home page

Mar 17 2019 6:43 PM | Updated on Mar 17 2019 6:52 PM

police records statement of YS vivekananda reddy brothers - Sakshi

సాక్షి, పులివెందుల : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి సోదరులు ఆదివారం పులివెందులలోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ..’పోలీసులు పిలిస్తే డీఎస్పీ కార్యాలయానికి వచ్చాం. పోలీసులకు అన్నివిధాల సహకరిస్తాం. హత్య జరిగిన వెంటనే మేమంతా అక్కడికి వెళ్లాం. అక్కడ ఏమి జరిగిందనే అంశంపై ఆరా తీశారు. కేసులో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అన్యాయంగా వివేకాను చంపేశారు. ఆయన చాలా మంచివ్యక్తి’  అని అన్నారు. 

మరోవైపు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌ రెడ్డి కూడా డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాగా ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారు, రక్తాన్ని తుడిచి వేయడం, మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూంకి ఎందుకు తెచ్చారు అనే కోణంలో ప్రశ్నించిన పోలీసులు...వీరందరి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement