విద్యార్థిని వేధిస్తున్న ఉద్యోగిపై కేసు నమోదు | police case against acharya nagarjuna university employee | Sakshi
Sakshi News home page

విద్యార్థిని వేధిస్తున్న ఉద్యోగిపై కేసు నమోదు

Nov 28 2015 11:02 AM | Updated on Oct 16 2018 2:53 PM

కాంట్రాక్ట్ ఉద్యోగి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది.

గుంటూరు : కాంట్రాక్ట్ ఉద్యోగి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చోటు చేసుకుంది. యూనివర్శిటీలోని విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి రమేష్... యూనివర్శిటీలో చదువుతున్న ఎంబీఏ విద్యార్థిని తనను పెళ్లి చేసుకోవాలని వెంట పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె పెదకాకాని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement