వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు చంచల్గూడ జైలు వద్దకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
	హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు చంచల్గూడ జైలు వద్దకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ను కలిసేందుకు అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా పోలీసు చర్యలను పార్టీ శ్రేణులను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసింది. దాంతో  పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, ముక్కా రూపానందరెడ్డిల సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో 400 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కంచన్బాగ్  స్టేషన్కు తరలించారు.
	
	మరోవైపు నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు  మద్దతు తెలిపేందుకు పార్టీశ్రేణులు, అభిమానులు చంచల్‌గూడకు చేరుకుంటున్నారు.  జగన్‌కు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు మహిళలు మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా జగన్ను కలిసేందుకు చంచల్గూడ జైలు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రవీణ్కుమార్ రెడ్డికి ములాఖత్కు అనుమతి లేదంటూ జైలు అధికారులు నిరాకరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
