'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు' | pinelli ramakrishna reddy condemns disappear cases | Sakshi
Sakshi News home page

'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'

Oct 19 2014 1:45 PM | Updated on Aug 10 2018 8:08 PM

'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు' - Sakshi

'నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు'

తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఖండించారు.

గుంటూరు:తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు. కొంతమంది టీడీపీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులో మాట్లాడానని తెలిపారు.

 

తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. అధికారం అనేది శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement