తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లో వెళ్తున్న ఓ ఎన్‌ఆర్ఐ భక్తుడిని జేబుదొంగ దోచేశాడు.
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లో వెళ్తున్న ఓ ఎన్‌ఆర్ఐ భక్తుడిని జేబుదొంగ దోచేశాడు. స్వామివారికి కానుకగా సమర్పించాలనుకున్న భక్తుడి పర్స్‌ని జేబుదొంగ కాజేశాడు. బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సి.సి కెమెరా ద్వారా ఈ దొంగతనాన్ని గుర్తించారు. మహాద్వారం భద్రతా సిబ్బందికి తెలిపారు. మహాద్వారం వద్దగల తనిఖీ కేంద్రం వద్ద చేతివాటం ప్రదర్శించిన దొంగను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
తనిఖీలో 18 లక్షలు విదేశీ కరెన్సీ వుండటంతో అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు గుట్టు భయటపడింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించి దొంగను తిరుమలలోని క్రైం పోలీసులకు అప్పగించారు.నిందితుడు అనంతపురానికి చెందిన రాజేష్‌గా పోలీసులు చెబుతున్నారు.నిందితుడు పాత నేరస్తుడిగా వెల్లడించారు.