పెట్రోలియం డీలర్ల సమ్మె విరమణ | Petroleum dealers' Strike retirement | Sakshi
Sakshi News home page

పెట్రోలియం డీలర్ల సమ్మె విరమణ

Mar 31 2015 1:18 AM | Updated on Sep 2 2017 11:36 PM

తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం మంగళవారం చేయ తలపెట్టిన సమ్మెను పెట్రోలియం డీలర్లు విరమించుకున్నారు.

సాక్షి,హైదరాబాద్: తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం మంగళవారం చేయ తలపెట్టిన సమ్మెను పెట్రోలియం డీలర్లు విరమించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు  దినేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ వినయ్‌కుమార్ మాట్లాడుతూ సోమవారం ముంబైలో చమురు శాఖ మంత్రి సమక్షంలో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన చమురు కంపెనీలు పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌కు లిఖితపూర్వక హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. దీంతో డీలర్లు మంగళవారం పెట్రోల్ ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగించాలని వారు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement