కేంద్ర ప్రభుత్వం ఏకంగా లీటరు పెట్రోల్‌పై రూ.3.37, డీజిల్‌పై రూ.2.17 చొప్పున పెంచింది.
తిరుపతి మంగళం : కేంద్ర ప్రభుత్వం ఏకంగా లీటరు పెట్రోల్‌పై రూ.3.37, డీజిల్‌పై రూ.2.17 చొప్పున పెంచింది. జిల్లాలో రోజుకు పెట్రోల్ సరాసరి 2.02 లక్షల లీటర్లు వినియోగంలో ఉంది. అంటే సరాసరి నెలకు రూ.8.53 కోట్ల అదనపు భారం వాహనదారులపై పడింది. అయితే గడిచిన 15 రోజులలోపే లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.7.59, డీజల్‌పై రూ.4.66 చొప్పున పెరగడం గమనార్హం. దీని ప్రభావంతో జిల్లాలో నిత్యావసర సరుకులు పాలు, పండ్లు, కూరగాయలతో పాటు రవాణా చార్జీలు భారీగా పెరగనున్నాయి.
పెరిగిన ఇంధన ధరలు...
ప్రస్తుతం పెరిగింది
పెట్రోల్ (లీ) రూ.72.64 రూ.76.01
డీజిల్ (లీ) రూ.57.93 రూ.60.09