నీళ్ల పెట్రోల్!

petrol Adulteration with water in ysr district - Sakshi

పెట్రోల్‌లో నీళ్లు కల్తీ..?

మరమ్మతులకు గురవుతున్న వాహనాలు  

కడప రూరల్‌: ఇన్నాళ్లు పెట్రోల్‌లో కిరోసిన్‌ను కలిపారు. కాగా కిరోసిన్‌ ధర కూడా ఇంచుమించు పెట్రోల్‌ రేట్లతో పోటీ పడుతోంది. దీంతో పెట్రోల్‌లో కిరోసిన్‌ కల్తీకి దాదాపుగా అడ్డుకట్ట పడింది. తరువాత  చౌక ధరలో లభించే రసాయనిక ద్రావణాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు పెట్రోల్‌లో నీళ్లను కల్తీగా కలిపే స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని బైక్‌ మెకానిక్‌లు కూడా నిర్ధారించడం గమనార్హం.

మొరాయిస్తున్న బైక్‌లు...
జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో 300 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. కడప నగర పరిధిలో 15కు పైగా పెట్రోల్‌ బంకులున్నాయి. ఇటీవల మంచి కండీషన్‌లో ఉన్న కొన్ని బైక్‌లు ఉన్న ఫళంగా మొ రాయిస్తున్నాయి. దీంతో పలువురు మెకా నిక్‌లను సంప్రదించారు. వాహనా లను పరిశీలించిన మెకానిక్‌లు పెట్రోల్‌లో నీళ్లు కలిశాయని గుర్తించారు. ఇలా పలు వాహనాలు మెకానిక్‌ల వద్దకు రావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పెట్రోల్‌లో నీళ్లు కలవడం వలన బండి ‘స్టార్ట్‌’ కాదు. ఇంజన్‌ హెడ్‌ వాల్‌ బెండ్‌ అవుతుంది. కార్బొరేటర్‌ చెడిపోతుంది. నీళ్ల కారణంగా పెట్రోల్‌ ట్యాంక్‌ చిలుము పడుతుంది. మళ్లీ బైక్‌ పరిగెత్తాలంటే మరమ్మతులకు రూ.3 వేల వరకు ఖర్ఛువుతుంది. కాగా పెట్రోల్‌లో నీళ్లు పొరపాటున కలిశాయా లేదా ఇదంతా కావాలనే జరుగుతోందా...? అనేది తెలియాల్సి ఉంది.

పెట్రోల్‌లో నీళ్లు ఉన్నాయి: పెట్రోల్‌లో నీళ్లు ఉన్న కారణంగా ఈ నెలలోనే  చెడిపోయిన బైక్‌లు నా వద్దకు నాలుగు వచ్చాయి. ఇలా జరగడం వలన బండ్లు దెబ్బతింటాయి. వాహనదారుడికి ఖర్చు దండిగా అవుతుంది.    – పఠాన్‌ ఖాదర్‌బాషా,మెకానిక్, జేకే బైక్‌ పాయింట్‌ కడప

నీళ్ల కల్తీ వాస్తవం కాదు...
కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పెట్రోల్‌లో ‘ఎథనాల్‌’ అనే కెమికల్‌ను కలుపుతున్నారు. దీనికారణంగా పొరపాటున పెట్రోల్‌కు తేమ తగిలినా, అందులో ఒక నీటి చుక్క పడినా సమస్య వస్తుంది.  పెట్రోల్‌లో నీళ్ల కల్తీ జరుతోంది అనేది అవాస్తవం. – నిస్సార్‌జాన్,జిల్లా అధ్యక్షుడు, పెట్రోల్‌ బంకుల అసోసియేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top