అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య | persecutions woman's suicide | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య

Sep 30 2013 2:18 AM | Updated on Nov 6 2018 7:53 PM

అత్తింటి వేధింపులతో ఓ మహిళ ఉరివేసుకు ని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం

ఖానాపురం, న్యూస్‌లైన్ : అత్తింటి వేధింపులతో ఓ మహిళ ఉరివేసుకు ని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తౌడోజు కృష్ణకు ఇల్లందుకు చెందిన స్రవంతి(25)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణ మహబూబాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అనోన్యంగా ఉంటున్న వారికి ఒక కుమారుడు జన్మించాడు. కొంతకాలంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివా రం రాత్రి స్రవంతికి ఆమె అత్తమామలతో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న భర్త ముగ్గురిని మందలించాడు. దీంతో మనోవేదనకు గురైన స్రవంతి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంత సేపటకీ బయటికి రాకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరివేసుకుని కనిపించింది. దీంతో స్రవంతిని కిందకిదింపి చూడగా అప్పటికే మృతిచెందింది. 
 
 అత్తమామల సూటిపోటి మాటలతోనే... 
 తన కూతురు ఆత్మహత్యకు ఆమె అత్త,మామలు సరోజన, బిక్షమాచారియే కారణమని మృతురాలి తల్లిదండ్రులు నాగాచారి, విజయలక్ష్మి రోదిస్తూ తెలిపారు. కొంత కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు కూతురు చెప్పిందని, అనారోగ్యంతో బాధపడినా తిడుతున్నారని, ‘నీవు చస్తే  మా కొడుక్కు రెండో పెళ్లి చేస్తామని బాధపెట్టేవారని’ కూతురు తమతో చెప్పిందన్నారు. 
 
 గొడవలు అవే సర్దుకుపోతాయని సర్దుకుపోవాలని కూడా చెప్పామని ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. వారి వేధింపులు ఎక్కువయ్యేసరికే తట్టుకోలేక ఉరివేసుకుని చనిపోయందన్నారు. ఈ విషయమై ఎస్సై గణపతి నరేష్‌ను వివరణ కోరగా మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement