వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్ర జలు, కార్యకర్తలే అండ అని ఆత్మకూ రు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.
సోమశిల, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్ర జలు, కార్యకర్తలే అండ అని ఆత్మకూ రు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అనంతసాగరం మండలం సమీపంలో చాపురాళ్లపల్లి శివారు ప్రాంతంలో పాదయాత్ర క్యాంపు వద్ద ఆదివారం అనంతసాగరం, చేజర్ల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాబోతున్నారన్నారు.
ఆయనకు ప్రజల దీవెనలు, కార్యకర్తల అండదండలున్నాయన్నారు. కాం గ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలు, కుతంత్రాలు జగన్‌పై ఉండే ప్రజాభిమానం ముందు బలాదూర్ అయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ఇకపై తాను పూర్తి కాలాన్ని నియోజకవర్గంపైనే దృష్టి పెడతానన్నారు. ప్రజాసేవకు మేకపాటి కుటుంబం అంకితమైందన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం తథ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేముల సుబ్బారెడ్డితో పాటు ఆత్మకూరు నాయకులు పూనూరు రమేష్, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, తూమాటి దయాకర్‌రెడ్డి, అనంతసాగరం నాయకులు చిలకా సుబ్బరామిరడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, కాటంరెడ్డి రమణారెడ్డి, రాచపల్లి రమణారెడ్డి, రత్నారెడ్డి, శ్రీమన్నారాయణ, శ్రీనివాసరాజు, బిజివేముల ఓబుల్‌రెడ్డి, కుప్పారెడ్డి, దశరథరామిరెడ్డి, కేతా రవీంద్రారెడ్డి, విజయ్‌మోహన్‌రెడ్డి, రమణయ్యయాదవ్, కలువాయి రోశిరెడ్డి, పార్లపల్లి కృష్ణారెడ్డి, సన్నపరెడ్డి నారసింహారెడ్డి, యు. మస్తానయ్య, మాజీ సర్పంచ్ సయ్యద్ ఎస్థానీ, కరేటి పెంచలయ్య, మాజీ సర్పంచ్ కాలువ నరసింహులు, లింగంగుంట జయరామయ్య, చేజర్ల నాయకులు బూదళ్ల వీరరాఘవరెడ్డి, ఉగ్గుమూడి రఘురామిరెడ్డి, బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పూనూరు మనోహర్‌రెడ్డి, గుండుబోయిన నారాయణ, మర్రిపాడు మండలం నాయకులు మన్నె రామ్‌గోపాల్, శేషం హజరత్‌బాబుయాదవ్, కొండారెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.