మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలు..

People Protest Against Bhuma Akhila Priya Illegal Mining - Sakshi

సాక్షి, కర్నూలు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో అక్రమంగా చేపడుతున్న ఎర్రమట్టి తవ్వకాలను ప్రజలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో మంత్రి అఖిల ప్రియ ఆధ్వర్యంలో చేపట్టిన అక్రమ తవ్వకాలను గ్రామ నాయకులు, రైతులు అడ్డుకున్నారు. సుమారు 500 మంది రైతులు చెరువు వద్దకు చేరుకుని తవ్వకాలు జరుపుతున్న జేసీబీ, ప్రొక్లెయిన్లను, టిప్పర్లను వెనక్కు పంపారు. అనంతరం అక్రమ తవ్వకాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను, నాయకులను వెనక్కి పంపించారు. అయితే మంత్రి అఖిల ప్రియ పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top