కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన దీక్ష | Pensioner protest initiation in front of collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల నిరసన దీక్ష

Aug 15 2013 5:45 AM | Updated on Sep 1 2017 9:51 PM

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్షలు చేపట్టారు.

ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట  నిరాహారదీక్షలు చేపట్టారు. ఈపీఎఫ్ పెన్షనర్ల ఆల్‌ఇండియా సమన్వయ కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ఈటీసీ, జీసీసీ, డెయిరీ, కోఆపరేటివ్, షుగర్స్, బ్యాంక్స్, ఆర్టీసీ తదితర విభాగాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.  కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చారంగయ్య ప్రారంభించి మాట్లాడారు.
 
  తాత్కాలిక భృతికింద పెన్షనర్లందరకీ రూ.వెయ్యి ఇవ్వాలని కోరారు.  పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మాదిరిగా వైద్య వసతులను కొనసాగించాలన్నారు. పెన్షనర్ల మూల ధనాన్ని వారసులకు చెల్లించాలన్నారు.  అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్‌కు అందజేశారు. దీక్షల్లో ఎస్.కోటిలింగం, నల్లమోతు వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్వర రావు, జెఎస్.ప్రసాద్, వై.లక్ష్మణ్, ఎంవీఎస్‌ఎస్ నారాయణ, చింపయ్య, వి.నర్స య్య కూర్చొన్నారు.  కార్యక్రమంలో నాయకులు పి.కృష్ణారా వు, వాసిరెడ్డి వీరభద్రం, కె.రామనాధం, ఆర్.రాఘవయ్య, పి. రాఘవయ్య, ఎం.రామారావు, రజిబ్‌అలీ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement