బొబ్బిలి చేరుకున్న జన సేన అధినేత | Pawan Kalyan Who Reached Bobbili | Sakshi
Sakshi News home page

బొబ్బిలి చేరుకున్న జన సేన అధినేత

May 30 2018 12:29 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan  Who Reached Bobbili - Sakshi

పవన్‌ కళ్యాణ్‌

బొబ్బిలి : జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు ఆయన బృందం బొబ్బిలి చేరుకుంది. పట్టణంలోని సూర్య రెసిడెన్సీలో ఆయన రాత్రి బస చేశారు. పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలు హోటల్‌ వద్ద ఆయన కోసం ఎదురు చూశారు. బస్సు దిగగానే అభిమానులకు అభివాదం చేసిన పవన్‌ వెంటనే హోటల్‌ రూంలోకి వెళ్లిపోయారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు. రెండు రోజుల పాటు పవన్‌ యాత్ర జిల్లాలో ఉంటుందన్నప్పటికీ పూర్తి స్థాయి సమాచారం మాత్రం ఎవరికీ చెప్పలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement