
చంద్రబాబు సమాధానం చెప్పాలి: పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీటీడీ ఈవో పదవిపై సంచలన ట్విట్ చేశారు.
హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీటీడీ ఈవో పదవిపై సంచలన ట్విట్ చేశారు. ఉత్తరాది ఐఏఎస్ అధికారినిని టీటీడీ ఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే అమర్‌నాథ్, వారణాసి, మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ సూటిగా ప్రశ్నించారు.
కాగా ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు తెలుగువారు తమ సత్తా చాటారని చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కనపెట్టి ఉత్తరాది అధికారిని టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారంటూ రాష్ట్రానికి చెందిన అధికారులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్‌కుమార్ సింఘాల్ నియామకాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్న విషయం తెలిసిందే.
‘పవన్ కల్యాణ్ మౌనం ఆశ్చర్యమేస్తోంది’
టీటీడీ ఈవో నియామకంపై కోర్టుకెళ్తా
— Pawan Kalyan (@PawanKalyan) 8 May 2017