ఐదు వేలకు ‘బంగారుతల్లి’ విక్రయం | Parents sale Girl child for 5 thousand | Sakshi
Sakshi News home page

ఐదు వేలకు ‘బంగారుతల్లి’ విక్రయం

Feb 13 2014 4:13 AM | Updated on Sep 2 2017 3:38 AM

మూడో సంతానంగా పుట్టిన ఆడపిల్లను ఆ తల్లిదండ్రులు సాకలేక పిల్లలు లేని దంపతులకు రూ. 5 వేలకు విక్రయించిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాలకుర్తి, న్యూస్‌లైన్: మూడో సంతానంగా పుట్టిన ఆడపిల్లను ఆ తల్లిదండ్రులు సాకలేక పిల్లలు లేని దంపతులకు రూ. 5 వేలకు విక్రయించిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామ శివారు గుడికుంట తండాకు చెందిన బానోతు భారతి, హరిచందర్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆర్నెళ్ల క్రితం మూడో సంతానంగా కూతురు జన్మించింది. ఆడపిల్ల కావడంతో పోషించలేమని భావించిన తల్లిదండ్రులు ఆ బిడ్డను అమ్మకానికి పెట్టారు. ఇదే మండంలోని ఓ గ్రామానికి చెందిన సంతానం లేని  దంపతులకు రూ.5,000కు వారం రోజుల క్రితం విక్రయించారు. తమ బిడ్డను విక్రయించిన మాట వాస్తవమేనని పసికందు తల్లిదండ్రులు ‘న్యూస్‌లైన్’ వద్ద అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement