
ప్రతీకాత్మక చిత్రం
ఆటోడ్రైవర్‌ను పాఠశాలకు లాక్కొచ్చి చితకబాదారు.
సాక్షి, పశ్చిమగోదావరి: తన కూతురును వేధిస్తున్న ఆటోడ్రైవర్‌ను ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన పాలకేడేరు మండలం విస్సాకోడేరులో మంగళవారం వెలుగుచూసింది. జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను ఆటోడ్రైవర్ గతకొంతకాలంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పుకుని భోరుమంది. దీంతో వారు సదరు ఆటోడ్రైవర్‌ను పాఠశాలకు లాక్కొచ్చి చితకబాదారు. విద్యార్థిని తల్లి నిందితుడికి దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆటో డ్రైవర్‌ను పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు.