'మైనారిటీల కోసం దుల్హన్' | palle ragunath reddy starts dulhan Welfare scheme for minorities | Sakshi
Sakshi News home page

'మైనారిటీల కోసం దుల్హన్'

May 21 2015 6:55 PM | Updated on Sep 3 2017 2:27 AM

'మైనారిటీల కోసం దుల్హన్'

'మైనారిటీల కోసం దుల్హన్'

మైనారిటీ యువతీ, యువకులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం చేయడానికి దుల్హన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రారంభించారు.

హైదరాబాద్: మైనారిటీ యువతీ, యువకులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం చేయడానికి దుల్హన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మైనారిటీ యువతీ యువకులకు వివాహ సమయంలో రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్టు మంత్రి చెప్పారు.

 

ముస్లిం విద్యార్థులు, నిరుద్యోగుల కోసం రోషిని ప్యాకేజీ పథకాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా తత్కాల్, సూక్ష్మరుణాలు, ఆదరణ, దుకాణ్ మకాన్ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మైనార్టీలంతా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement