బిల్లును యుద్ధ విమానంలో పంపడమేంటి? | Palle Raghunatha Reddy views on telangana draft bill | Sakshi
Sakshi News home page

బిల్లును యుద్ధ విమానంలో పంపడమేంటి?

Jan 9 2014 2:51 PM | Updated on Sep 2 2017 2:26 AM

బిల్లును యుద్ధ విమానంలో పంపడమేంటి?

బిల్లును యుద్ధ విమానంలో పంపడమేంటి?

రాహుల్ గాంధీని ప్రధాని సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు.

హైదరాబాద్: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే  సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్య వైషమ్యాలు రేపారన్నారని విమర్శించారు. మూడేళ్లయినా శ్రీకృష్ణ కమిటీని పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.

విభజన బిల్లును హైదరాబాద్కు యుద్ధవిమానంలో పంపించడంలో ఔచిత్యం ఏమిటని నిలదీశారు. 371డీ అంశాన్ని రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిందే నని చెప్పారు. రాష్ట్రం మైక్యంగానే ఉంటేనే ఆర్థిక, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక ప్రగతి సాధ్యమన్నారు. అయితే సోనియాపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం రేగింది.

Advertisement
 
Advertisement
Advertisement