'బస్సు పత్రాలన్నీ బోగస్సేనని మంత్రి ఒప్పుకున్నారు' | palem bus victims meet botsa satyanarayana | Sakshi
Sakshi News home page

'బస్సు పత్రాలన్నీ బోగస్సేనని మంత్రి ఒప్పుకున్నారు'

Jan 6 2014 2:27 PM | Updated on Sep 2 2017 2:21 AM

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాలెం బస్సు ప్రమాద బాధితులు సోమవారం సమావేశమైయ్యారు.

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాలెం బస్సు ప్రమాద బాధితులు సోమవారం సమావేశమైయ్యారు. అనంతరం వారం మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు పత్రాలన్నీ బోగస్సేనని బొత్స ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. ఆ ఘటనకు బాధ్యులయిన వారిపై కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారన్నారు. బాధితులకు పరిహారం, ఉపాది తదితర విషయాలపై సీఎంకు లేఖ రాస్తానని బొత్స హామి ఇచ్చారని వారు తెలిపారు. ఆ దుర్ఘటనలో చనిపోయిన వారందరవి ప్రభుత్వ హత్యలేనని ప్రమాద బాధితులు పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగ విషయం గురించి త్వరలో సీఎంను కలుస్తామని వారు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement