హత్యా రాజకీయాలను నిరసించాలి | Opposed to the politics of murder | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాలను నిరసించాలి

Feb 1 2014 3:55 AM | Updated on May 29 2018 3:40 PM

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారికి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ : హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారికి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ పులీందర్‌రెడ్డి హత్యను  ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి నర్సింహుల గూడెంలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ప్రశాంతత నెలకొల్పడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థిని హత్య చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు.
 
 కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఇలాం టి దౌర్జన్య రాజకీయాల వెనుక ఎవరి అండ ఉందో వెం టనే పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఇలాం టి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు.   పులీందర్‌రెడ్డిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన మృతికి తమ పార్టీ  సంతాపం వ్యక్తం చేస్తుందని, ఆ కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, హుజూర్‌నగర్ పట్టణ, మండల కన్వీనర్లు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, మేళ్లచెరువు, మఠంపల్లి మండల కన్వీనర్లు చిలకల శ్రీనివాసరెడ్డి, జాలా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
 
 వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జిల్లా ప్రతినిధుల నియామకం
 ఈనెల 2న ఇడుపులపాయలో జరిగే వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశానికి జిల్లా ప్రతినిధులుగా ఇరుగు సునీల్‌కుమార్, మేకల ప్రదీప్‌రెడ్డిని నియమించినట్లు గట్టు శ్రీకాం త్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా నుంచి ప్లీనరీకి హాజరవుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి అవసరాలు ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement