ఉల్లి వ్యాపారి లొల్లి | Onion trader fight | Sakshi
Sakshi News home page

ఉల్లి వ్యాపారి లొల్లి

Aug 28 2015 2:39 AM | Updated on Sep 3 2017 8:14 AM

ఉల్లి వ్యాపారి లొల్లి

ఉల్లి వ్యాపారి లొల్లి

ఆరుగాలం కష్టపడి శ్రమించిన రైతులకు కష్టాలు, నష్టాలు త ప్పడం లేదు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ఉల్లి రైతు కంట నీరు తెప్పిస్తున్నారు

♦ మార్కెట్‌లో ధరల మోత..
♦ రైతుకు వాత సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు
 
 ఉల్లి పంట పండిందని ఆనందంతో ఉన్న రైతుల ఆశలను వ్యాపారులు మొగ్గలోనే తుంచివేస్తున్నారు. కిలో రూ.20 చొప్పున కొంటూ గోదాముల్లో దాచుకుంటున్నారు. బయట మార్కెట్‌లో మాత్రం ఉల్లి తల్లి బంగారమైంది. కిలో రూ.60-70 పెట్టి కొనలేక సామాన్యుల వంటింట్లో ఉల్లి కరువైంది. నాలుగు గడ్డలను కోసి కూరల్లో వేయడానికి మహిళల చేతులాడటం లేదు.
 
 పెండ్లిమర్రి : ఆరుగాలం కష్టపడి శ్రమించిన రైతులకు కష్టాలు, నష్టాలు త ప్పడం లేదు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ఉల్లి రైతు కంట నీరు తెప్పిస్తున్నారు.  కష్టపడి ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కష్టం తప్ప ఫలితం రావడం లేదు. మార్కెట్‌లో ఉల్లిపాయల ధర ఆకాశాన్నంటుతుండగా, వ్యాపారులు మాత్రం రైతుల వద్ద నుంచి క్వింటాలు రూ. రెండు వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. పెండ్లిమర్రి, వేముల, సికె దిన్నె, మైదుకూరు, వేంపల్లె, ఖాజీపేట, ముద్దనూరు తదిత ర మండ లాల్లో 2500 హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది.

అయితే రాష్ట్రానికి కావాల్సినంత సరఫరా కాకపోవడం, మార్కెట్ మాయాజాలం వల్ల ప్రస్తుతం ఉల్లి కిలో రూ.40 నుంచి రూ.70 దాకా విక్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన కొందరు వ్యాపారులు ఎక్కడికక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాముల్లో దాచి పెడుతున్నారు. ఉల్లి వ్యాపారులందరూ సిండికేట్‌గా ఏర్పడి.. రాజమండ్రి, తాడేపల్లె గూడెంలో మార్కెట్ ధరలు తగ్గాయని కిలో రూ.20-25 అయితే కొనుగోలు చేస్తాం, లేదంటే  లేదని ఒకే మాటపై ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.
 
 దళారులు సిండికేటయ్యారు
 ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఉల్లిపంట సాగు చేశాను. పంట బాగా పండింది. ధరలు బాగా ఉండడంతో మంచి లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. ప్రస్తుతం దళారులు కుమ్మక్కై కిలో రూ.20 చొప్పున అడుగుతున్నారు. మార్కెట్లో మాత్రం కిలో రూ. 50-60 అమ్ముతున్నారు. దళారుల మూలంగా నష్టపోతున్నాం.
 - లింగాల గోపాల్, రైతు, రామచంద్రాపురం, పెండ్లిమర్రి మండలం
 
 ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
 నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. రెండు ఎకరాల్లో వచ్చిన గడ్డలను కిలో రూ.32 చొప్పున అమ్మాను. ప్రస్తుతం దళారులు, వ్యాపారులు సిండికేటై రూ.20-25 రేటు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలాగైతే మాకు లాభాలు రావు. ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలి.
 - సికె బసిరెడ్డి, రైతు, బాలయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement