ఓపిక సన్నగిల్లినా.. మంత్రాల్లో మిన్నే.. | old priests doing pograms at rajamandry ghat | Sakshi
Sakshi News home page

ఓపిక సన్నగిల్లినా.. మంత్రాల్లో మిన్నే..

Jul 19 2015 11:34 AM | Updated on Aug 1 2018 5:04 PM

వయసు మీద పడింది. ఓపిక సన్నగిల్లింది. అయినా వారి వాక్కు దృఢంగానే ఉంది.

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : వయసు మీద పడింది. ఓపిక సన్నగిల్లింది. అయినా వారి వాక్కు దృఢంగానే ఉంది. మంత్రోచ్చరణ స్వచ్ఛంగానే ఉంది. పుష్కర తీర్థవిధులను నిర్వర్తింపజేసే పురోహితుల్లో పండు వృద్ధులూ ఉన్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుణ్యతరుణంలో ‘పుణ్యం..పురుషార్థం’ అంటూ వారు వయసులో ఉన్న సాటి పురోహితులతో పోటీ పడుతూ వారికి దీటుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కోటిలింగాలఘాట్లో చేతికర్ర ఊతంతో నిలబడి సంకల్పం చెప్పిస్తున్న వృద్ధ పురోహితుడే అందుకు నిదర్శనం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement