వంద దాటినోళ్లూ ఊయలలో బిడ్డలే.. | Sakshi
Sakshi News home page

వంద దాటినోళ్లూ ఊయలలో బిడ్డలే..

Published Wed, Jul 22 2015 1:27 PM

వంద దాటినోళ్లూ ఊయలలో బిడ్డలే.. - Sakshi

పుష్కరఘాట్ (రాజమండ్రి): నిండు నూరేళ్లు దాటిన  పండు ముదుసలుల నుంచి పొత్తిళ్లలోని పాపాయిల వరకూ అందరినీ తన ఒడిలో బిడ్డల్లా చల్లగా లాలిస్తున్న ఆ గోదారమ్మ.. తన గుండెల్లో నిండుతున్న ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తుంది? బహుశా.. అలల మిలమిలలే ఆ తల్లి చెక్కిళ్ల సంతోషపు తళుకులేమో! మంగళవారం పుష్కరఘాట్లో 9వ సారి గోదావరి పుష్కరస్నానం చేసిన అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరానికి చెందిన 103 ఏళ్ల నరిమెళ్ల కోటేశ్వరరావును, 8వసారి పుష్కరస్నానం చేసిన శ్రీకాకుళం జిల్లా మందగోడికి చెందిన బత్తుల లక్ష్మివేణిని చిత్రాల్లో చూడొచ్చు.

Advertisement
Advertisement