
సాక్షి, పశ్చిమ గోదావరి: ఎన్నికలు సందర్భంగా జిల్లాలోని దువ్వ పోలింగ్ కేంద్రంలో అపశృతి చోటుచేసుకుంది. బూత్ నెంబర్ 15లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన బంగారు ముసలయ్య అనే వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పటికీ మృతి చెందారు. దీంతో పోలింగ్ కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓటు వేయడానికి ఆయన ఉదయమే వచ్చినప్పటికీ ఎక్కువసేపు క్యూలైన్‌లో నిలబడటం వల్ల కుప్పకూలిపోయారని స్థానికులు తెలిపారు.