అట్టహాసంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ | Obviously, to the chairperson of the municipal | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ

Jul 10 2014 3:36 AM | Updated on Sep 2 2017 10:03 AM

అట్టహాసంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ

అట్టహాసంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతల స్వీకరణ

మున్సిపల్ చైర్‌పర్సన్ కే.శాంతికుమార్ బాధ్యతల స్వీకరణోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. నిర్ణయించిన శుభముహూర్తానికి ఎమ్మెల్యే ఆర్కేరోజా అధ్యక్షతన...

నగరి: మున్సిపల్ చైర్‌పర్సన్ కే.శాంతికుమార్ బాధ్యతల స్వీకరణోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. నిర్ణయించిన శుభముహూర్తానికి ఎమ్మెల్యే ఆర్కేరోజా అధ్యక్షతన మున్సిపల్ మా జీ చైర్మన్ కేజేకుమార్ ఆధ్వర్యంలో ము న్సిపల్ చాంబర్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ వెంకటేశ్వరస్వామికి పూజలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే ఆర్కేరో జా, ఆర్కే సెల్వమణి చైర్‌పర్సన్‌కు కేటాయించిన కుర్చీలో శాంతికుమార్‌ను కూర్చోబెట్టారు. ఆమెను, ఆమె భర్త కేజేకుమార్‌ను, వైస్ చైర్మన్ పీజీ నీలమేఘం ను ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చాంబర్‌లో ఆశీనురాలైన శాంతికుమార్ మున్సిపల్ పన్నులను కంప్యూటరీకరించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, మేనేజర్ లీలాప్రసాద్, డీఈ లీలాకృష్ణప్రసాద్, సిబ్బంది ముని కృష్ణారెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ చైర్‌పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
 
పార్టీలకతీతంగా అభివృద్ధి: ఆర్‌కే.రోజా

పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయని నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలోను, తదుపరి నిర్వహించిన ర్యాలీలోను ఆమె మాట్లాడారు. తాను ప్రజలందరికీ ఎమ్మెల్యేనన్నారు. నగరి ప్రజలు తొలి మహిళా ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించారని తెలి పారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మహిళకే అవకాశం రావడంతో మహిళలకు పెద్దపీట వేసినట్లయిందన్నారు. కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలన్నారు. అప్పుడే మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement