
సాక్షి, నూజివీడుః కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ యోగా చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ముగిశాయి. మహిళా విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థినులకు ప్రథమ స్థానం దక్కగా, పురుషుల విభాగంలో చెన్నై అన్నా యూనివర్శిటీ దక్కించుకున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ యోగా విద్యార్థులు మూడు ప్రధాన బహుమతులను గెలుచుకున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, వీసీ హేమచంద్రారెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు.