హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌..! | notifications for home guards | Sakshi
Sakshi News home page

హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌..!

Nov 30 2017 8:27 AM | Updated on May 10 2018 12:34 PM

notifications for home guards - Sakshi

చిత్తూరు అర్బన్‌:  హోంగార్డు పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. చిత్తూరు పోలీసు జిల్లాలో ఖాళీగా ఉన్న 160 హోంగార్డు పోస్టు ల భర్తీకు ఎస్పీ రాజశేఖర్‌బాబు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రూ.25 డీడీని చిత్తూరు పోలీసు కార్యాలయంలో అం దజేసి డిసెంబరు ఒకటి నుంచి దరఖాస్తులను పొందచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబరు 12లోపు అభ్యర్థులు నేరుగా అందజేయాలన్నారు. కాగా ఈ నోటిఫికేషన్‌లో కమ్యూనిటీ పోలీస్‌ ఆఫీసర్‌ (సీపీఓ)లను సైతం మెరిట్‌ మార్కులు ఇవ్వడం గమనార్హం. చిత్తూరు పోలీసు జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఎస్పీ పేర్కొన్నారు.

ఎంపిక ఇలా..
ఇందులో జనరల్‌ పోస్టులకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. జనలర్‌ హోంగార్డు పోస్టులకు 150 సెం.మీ ఎత్తు, పురుషులు 160 సెం.మీ ఎత్తు ఉండాలని, వీరికి 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్, షాట్‌పుట్‌ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన పోస్టులకు ఆయా విభాగాల్లో నైపుణ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement