
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల గ్రామంలోని సర్వే నంబర్ 167, 168ల్లో తనకున్న 11.60 ఎకరాల భూమిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ ఆక్రమించుకోవడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రైతు గొడుగుల సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది.
సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా రూరల్ ఎస్‌పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ జనరల్, ఆర్‌డీవో, తహసీల్దార్‌లకు నోటీసులు జారీ చేశారు. అలాగే వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న డీఎస్పీ ఎం.మధుసూదన్‌రావు, సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ వెంకటరావు, కోడెల శివరామకృష్ణ, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌లకు కూడా నోటీసులిచ్చింది.