సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలకు నోబెల్‌ గ్రహీత గుడెనఫ్‌ ప్రశంసలు | Nobel laureate Scientist Goodenough praises CM YS Jagan for schemes | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ పథకాలకు నోబెల్‌ గ్రహీత గుడెనఫ్‌ ప్రశంసలు

Jan 29 2020 6:44 AM | Updated on Jan 29 2020 6:44 AM

Nobel laureate Scientist Goodenough praises CM YS Jagan for schemes - Sakshi

ప్రొఫెసర్‌ జాన్‌.బి.గుడెనఫ్‌తో భేటీ అయిన కుమార్‌ అన్నవరపు, రాజేశ్వరి దంపతులు

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలపై నోబెల్‌ అవార్డు గ్రహీత, జర్మనీ శాస్త్రవేత్త జాన్‌.బి.గుడెనఫ్‌ ప్రశంసలు కురిపించారు. పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అవన్నీ సమాజగతిని మార్చే కార్యక్రమాలని అన్నారు. గుడెనఫ్‌ టెక్సాస్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు, ఆయన సతీమణి రాజేశ్వరిలు ఇటీవల గుడెనఫ్‌ను కలిసి ఏపీలో విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యల గురించి  వివరించారు.

అమ్మఒడి, రైతుభరోసా, తదితర పథకాలు, వాటి లక్ష్యాల గురించి తెలిపారు. వీటిని ఆలకించిన గుడెనఫ్‌.. గరిష్ట స్థాయిలో ప్రజలు లబ్ధి పొందినప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా ఏపీ సీఎం చేస్తున్న పనులు అద్భుత ఫలితాలిస్తాయని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఏపీని సందర్శించాలనుకుంటున్నానని చెప్పారు. గుడెనఫ్‌ ప్రశంసలతో కూడిన వీడియోను డాక్టర్‌ కుమార్‌ విడుదల చేశారు. 

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ క్యాథోడ్‌ను కనుగొన్న గుడెనఫ్‌
జాన్‌.బి.గుడెనఫ్‌ 1922 జూలై 25న జన్మించారు. ప్రస్తుతం మానవాళి జీవిన విధానంలో భాగమైపోయిన స్మార్ట్‌ ఫోన్లో వాడే ‘లిథియమ్‌–ఇయాన్‌’ బ్యాటరీ క్యాథోడ్‌’ను కనుగొన్నదే ఈయనే. ఈ ఆవిష్కరణకుగాను గుడెనఫ్‌ కు 2019వ సంవత్సరానికి గాను నోబెల్‌ బహుమతి వచ్చింది. ఈయన కనిపెట్టిన బ్యాటరీయే మనం వాడుతున్న సెల్‌ఫోన్‌ నడవడానికి కారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement