రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య | No witch-hunt against Robert Vadra: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య

May 30 2014 9:24 PM | Updated on Sep 2 2017 8:05 AM

రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య

రాబర్డ్ వాద్రాపై ప్రతీకార చర్యలుండవు: వెంకయ్య

రాజకీయ ప్రత్యర్ధులపై ఎన్ డీఏ ప్రభుత్వం ఎలాంటి పగసాధింపు చర్యలుండవని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

బెంగళూరు: రాజకీయ ప్రత్యర్ధులపై ఎన్ డీఏ ప్రభుత్వం ఎలాంటి పగసాధింపు చర్యలుండవని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
 
రాజకీయ ప్రత్యర్ధులైన సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలాంటి వ్యక్తులపై ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టబోమని ఆయన అన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. 
 
రాజకీయ ప్రత్యర్ధులపై ఎలాంటి దాడులు చేయబోమని... హర్యానా, రాజస్థాన్ లోని వివాదస్పద భూకేటాయింపులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో యూపీఏ ప్రభుత్వంలో వాద్రా కు కేటాయించిన భూకేటాయింపులపై బీజేపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement