'బాబు హామీ ఇచ్చినా పదవి రాలేదు' | No place for Modugula venugopala reddy in chandrababu Naidu cabinet | Sakshi
Sakshi News home page

'బాబు హామీ ఇచ్చినా పదవి రాలేదు'

Jun 20 2014 8:52 AM | Updated on Sep 27 2018 5:59 PM

'బాబు హామీ ఇచ్చినా పదవి రాలేదు' - Sakshi

'బాబు హామీ ఇచ్చినా పదవి రాలేదు'

ఎంపీగా పార్లమెంట్లో ఎంతో పోరాటం చేశానని, ఈసారి ఎమ్మెల్యేగా గెల్చిన తనకు కెబినెట్లో అవకాశం ఉంటుందని ...

హైదరాబాద్ : ఎంపీగా పార్లమెంట్లో ఎంతో పోరాటం చేశానని, ఈసారి ఎమ్మెల్యేగా గెల్చిన తనకు కెబినెట్లో అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా పదవి రాలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన నిన్న అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ లోక్సభలో బిల్లు పెట్టిన రోజున ఒక్క మూడు నిమిషాల ముందు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను వినియోగించి ఉంటే రాష్ట్ర విభజన బిల్లు ఆగేదన్నారు. సోనియాగాంధీ తెలంగాణ విషయంలో చాలా కమిట్మెంట్తో వ్యవహరించారని, తాత్కాలికంగా అప్పటికి ఆగినా ఏదోలా ఆమె బిల్లును ఆమోదింపచేసేవారేనని మోదుగుల అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement