డెంగ్యూతో నవ వధువు మృతి | Newly married woman dies of Dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో నవ వధువు మృతి

Aug 28 2015 5:35 PM | Updated on Sep 3 2017 8:18 AM

డెంగ్యూతో చికిత్స పొందుతూ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చినప్యాపిలి గ్రామంలో శుక్రవారం జరిగింది.

వజ్రకరూర్ (అనంతపురం) : డెంగ్యూతో చికిత్స పొందుతూ నవ వధువు మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చినప్యాపిలి గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చినప్యాపిలి గ్రామానికి చెందిన సుజాత(19)కు పెద ప్యాపిలి గ్రామానికి చెందిన తిప్పయ్యతో మూడు నెలల కిందట వివాహమైంది.

అయితే గత వారం రోజులుగా సుజాత అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగ్యూ సోకిందని తెలపడంతో.. ఆమెను హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది.

Advertisement
 
Advertisement
Advertisement