బధిరుల కోసం.. కొత్త వినికిడి యంత్రం | new machine for deaf candidates | Sakshi
Sakshi News home page

బధిరుల కోసం.. కొత్త వినికిడి యంత్రం

Dec 31 2013 1:30 AM | Updated on Sep 4 2018 5:07 PM

బధిరుల కోసం.. కొత్త వినికిడి యంత్రం - Sakshi

బధిరుల కోసం.. కొత్త వినికిడి యంత్రం

బధిరులకు మరింత అనుకూలంగా ఉండేలా కోక్లియర్ ఇంప్లాంట్స్ సంస్థ నూతన వినికిడి యంత్రాన్ని రూపొందిం చింది.

సాక్షి, హైదరాబాద్: బధిరులకు మరింత అనుకూలంగా ఉండేలా కోక్లియర్ ఇంప్లాంట్స్ సంస్థ నూతన వినికిడి యంత్రాన్ని రూపొందిం చింది. ప్రస్తుతమున్న యంత్రాల పరిమాణం కన్నా 23% చిన్నసైజులో ఉండే ‘న్యూక్ల్యెస్-6’ అనే వినికిడి పరికరం బధిరులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సోమవారం దీనిని ఇక్కడ ఆవిష్కరించిన వైద్యులు పేర్కొన్నారు.

 

అతి సూక్ష్మ శబ్దాలను సైతం గ్రహించే శక్తి ఈ పరికరానికి ఉందని అపోలో ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్ రాంబాబు చెప్పారు. ఇది వాటర్ ప్రూఫ్ పరికరమని, వర్షంలో తడిసినా ఫర్వాలేదని అపోలో ఆస్పత్రి చీఫ్ ఆడియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement