రాష్ట్రంలో మహిళా ఖైదీల కోసం మూడు ప్రత్యేక జైళ్లు, మరో ఐదు సబ్ జైళ్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా ఖైదీల కోసం మూడు ప్రత్యేక జైళ్లు, మరో ఐదు సబ్ జైళ్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా 8 మహిళా జైళ్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. వరంగల్, రాజమండ్రి, హైదరాబాద్‌లో ప్రత్యేక జైళ్లు, మంగళగిరి, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, కరీంనగర్‌లో మహిళా సబ్‌జైళ్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త జైళ్ల కోసం ప్రభుత్వం 36 పోస్టులు మంజూరు చేసింది.