'నీలం' తూఫాన్ పరిహారం విడుదల | 'neelam' toofan compensation release | Sakshi
Sakshi News home page

'నీలం' తూఫాన్ పరిహారం విడుదల

Sep 25 2013 5:35 AM | Updated on Oct 1 2018 2:44 PM

నీలం తుపాను నష్ట పరిహారం ఎట్టకేలకు విడుదలైంది. రెండో విడతలో రూ.10.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని రైతులకు పంపిణీ చేయాలని అధికారులను నిర్దేశించింది.


 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: నీలం తుపాను నష్ట పరిహారం ఎట్టకేలకు విడుదలైంది. రెండో విడతలో రూ.10.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని రైతులకు పంపిణీ చేయాలని అధికారులను నిర్దేశించింది. ఇది లా ఉంటే తొలి విడతగా విడుదలైన పరిహారమే పూర్తిగా ఇప్పటికీ పంపిణీ కాలేదు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని రైతులకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో వారికి నష్ట పరి హారం అందలేదు. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఎటువంటి ఫలితంగా ఉండటం లేదు. గతేడాది నవంబర్‌లో నీలం తుపాను కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టం అంచనాలను తయారు చేసి అదే ఏడాది డిసెంబర్‌లో నివేదికను ప్రభుత్వానికి పంపా రు. 13,724.95 హెక్టార్లలో జరిగిన పంట నష్టానికి సంబంధించి 57080 మంది రైతులకు గాను రూ.13.34 కోట్లు మొద టి విడతగా విడుదల చేసింది.
 
  ఇందులో 11 కోట్లు పంపిణీ చేసినప్పటికీ మరో రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు నెల రోజుల క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బ్యాంకు అకౌంట్లు లేని రైతులకు చెక్కుల పంపిణీ చేసే విధంగా ఆదేశాలివ్వాలని కోరారు. కాని ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. తాజాగా రెండో విడతలో 10,862.61 హెక్టార్లలో పంట నష్టానికి సంబంధించి 49,101 మంది రైతులకు మొత్తం రూ.10.06 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. 50 శాతానికి పైగా పంట నష్టం జరిగిన రైతులకు మాత్రమే ఈ పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆధార్‌తో అనుసంధానం చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని లబ్ధిదారులైన  రైతులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తొలి విడతలోనే పరిహారం పూర్తిగా పంపిణీ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండో విడతలో కూడా బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఏ విధంగా పంపిణీ చేయాలన్న విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. బ్యాంక్ ఖాతాలు లేని రైతులకు చెక్కల రూపంలో పరిహారం అందించే అవకాశం ఇవ్వనిపక్షంలో వేల మంది రైతులకు పంట నష్టం అందే అవకాశం లేదు. దీనిపై అధికారులు మరోసారి ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement