నీలం సంజీవరెడ్డి జీవితం ఆదర్శనీయం:రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జీవితం ఒక ఆదర్శనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు నీలం స్పూర్తి దాయకమని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంత:మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జీవితం ఒక ఆదర్శనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు నీలం స్పూర్తి దాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. అనంత పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్.. నీలం సంజీవరెడ్డిని కొనియాడారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి నీలం ఎంతో కృషి చేశారన్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత సంజీవరెడ్డికే దక్కుతుందన్నారు. దేశ ప్రజలకు క్రిస్మస్, కొత్త సంవత్సర శుభాకాంక్షలను ప్రణబ్ తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతికి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
