వైఎస్‌ఆర్‌సీపీలోకి..నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు

Nayi Brahmin Leaders Join In YSR Congress YSR Kadapa - Sakshi

కడప కార్పొరేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులకొల్లు మల్లేశ్వరరావు  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కడప మేయర్, వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు ఆధ్వర్యంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ సమస్యలపై అనేకసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని, పైగా చర్చలకని సచివాలయానికి పిలిచి తీరని అవమానం చేశారన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపి కనీ సంక్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తే తమపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

అదే సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. దేవాలయాల్లో క్షురకులను పర్మినెం ట్‌ చేయడం, తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలకవర్గాల్లో క్షురకులకు అవకా శం, బార్బర్‌ షాపుల్లో 250 యూనిట్ల వర కూ ఉచిత విద్యుత్, ఆపైన 500 యూనిట్ల వరకూ డొమెస్టిక్‌గా మార్పు, శాసనమండలిలో అవకాశం, ఫెడరేషన్‌ స్థానంలో కార్పొరేషన్‌ ఏర్పాటు, బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహకారం, ప్రతి జిల్లాలో సంగీత కళాశాల, బ్యూటీపార్లర్‌ శిక్షణా కేం ద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే తమ సమస్యలు పరి ష్కారం అవుతాయని నమ్మి పార్టీలో చేరామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ  రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top