నేడు పశ్చిమకు జాతీయ విపత్తు నివారణ బృందం | National Disaster Management Authority official visits in west godavari district | Sakshi
Sakshi News home page

నేడు పశ్చిమకు జాతీయ విపత్తు నివారణ బృందం

Oct 11 2013 8:49 AM | Updated on Sep 1 2017 11:34 PM

ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీరం వెంబడి 9 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.

ఫైలిన్ తుపాన్ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీరం వెంబడి 9 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపురం డివిజన్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని అలాగే తీర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్లు, చెరువు గట్లను ఇసుక బస్తాలతో పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

 

దొంగరావిపాలెం, సిద్ధాంతంఏటిగట్టు, రాజుల్లంక, నక్కలడ్రైన్, నందమూరు అక్విడెట్టు, కడెమ్మ సూయీజ్లను.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నేడు జిల్లాకు జాతీయ విపత్తు నివారణ బృందం వస్తుందని వెల్లడించారు. ఏలూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్ 08812 230617ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement