నారాయణ స్కూల్‌ను సీజ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం

Narayana School Seized at Satyanarayanapuram In Vijayawada - Sakshi

గుర్తింపులేని స్కూళ్లపై విద్యాశాఖ కొరడా

సాక్షి, విజయవాడ : గుర్తింపులేని స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పటికే ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని నేడు (బుధవారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతుండటంతో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ ‘అమ్మ ఒడి’ ద్వారా ఆదుకుంటామని కొత్తగా కొలువుదీరిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి కేబినేట్‌ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలపై ‘రెగ్యులేటరీ కమిషన్‌’ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

చదవండి : ‘ప్రైవేటు’ ఫీజులపై నియంత్రణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top