
అచ్చం..నంద్యాల సీన్ రిపీట్!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ పెద్దలు కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తున్నారు.
మీరే కిడ్నాప్ చేశారేమో అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. కాకినాడ 35వ డివిజన్‌లో శుక్రవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ‘ఏ రాజకీయ పార్టీ అభివృద్ధి చేయగలదని భావిస్తున్నారు? చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? జగన్ తీరుపై ఏమనుకుంటున్నారు? కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు?’ అంటూ ప్రశ్నలు వేస్తూ వారు టీడీపీకి అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయాన్ని గమనించి నోట్ చేసుకుంటున్నారు. చివరలో ఇంటి యజమాని ఫోన్, అకౌంట్ నంబర్‌ను కూడా తీసుకుంటున్నారనే సమాచారం తెలియడంతో అనుమానం వచ్చిన అక్కడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెండా విష్ణు అనుచరులతో కలసి వెళ్లి అశోక్, విజయ్‌భాస్కర్, విజయ్ అనే వ్యక్తులను పట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటి తర్వాత.. ముగ్గురు వ్యక్తులను మీరు కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు చెప్పేసరికి వైఎస్సార్‌సీపీ నేతలు నివ్వెరపోయారు.
ఆ ట్యాబ్‌లలో ఓటర్ల లిస్టు నిక్షిప్తం చేసి మరీ ఇచ్చారు. సదరు ఇంటి యజమాని లేదా ఓటరు పేరు టైప్ చేయగానే ఓటరు అవునో కాదో కూడా అక్కడికక్కడే తెలిసిపోతోంది. మామూలుగా సర్వే చేసే వారి వద్ద ఇన్ని వివరాలు ఉండవు. పైగా అకౌంట్ నంబర్ అడగడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా సర్వే చేసే వారు ప్రతి ఇల్లూ తిరిగరనే విషయం తెలిసిందే. ఈ అనుమానాలతోనే వైఎస్సార్ సీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.