నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణం | Nandigama MLA Tangirala Prabhakara Passed away | Sakshi
Sakshi News home page

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణం

Jun 16 2014 2:00 AM | Updated on Sep 2 2017 8:51 AM

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణం

నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణం

కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

* గుండెపోటుతో ఆస్పత్రిలో కన్నుమూత
 
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (64) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు వెంటనే స్థానిక మదర్‌థెరిస్సా ఆస్పత్రికి  తరలించారు. అరుుతే 12 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రారంభం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ప్రభాకర్ 2009లో తొలిసారిగా నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన ఆయన న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు వీరులపాడు జెడ్పీటీసీగా, ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. ఆదివారం ఉదయమే ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement