'నెమలి వద్దు... వెంకన్న బొమ్మ కావాలి' | Najma Heptulla ask for Venkateswara Swamy Photo | Sakshi
Sakshi News home page

'నెమలి వద్దు... వెంకన్న బొమ్మ కావాలి'

Jul 20 2014 2:47 PM | Updated on Sep 2 2017 10:36 AM

'నెమలి వద్దు... వెంకన్న బొమ్మ కావాలి'

'నెమలి వద్దు... వెంకన్న బొమ్మ కావాలి'

బీజేపీ ఉపాధ్యక్షురాలు, కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా విలక్షణ నాయకురాలు.

హైదరాబాద్: బీజేపీ ఉపాధ్యక్షురాలు, కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా విలక్షణ నాయకురాలు. ముక్కుసూటిగా మాట్లాడడం, తనకు నచ్చింది చేయడం ఆమెకు అలవాటు. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమె తన సహజ ధోరణి ప్రదర్శించారు. ఆంధప్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన శిక్షణకు తరగతులకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె సభా కమిటీల ప్రాధాన్యతను వివరించారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెకు నెమలి బొమ్మ ఉన్న జ్ఞాపికను అందజేయబోయారు. అయితే వెంకటేశ్వరస్వామి చిత్రం ఉన్న జ్ఞాపిక కావాలని ఆమె అడిగి తీసుకోవడంతో అక్కడుకున్న వారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అంతకుముందు వెంకటేశ్వరస్వామి బొమ్మ ఉన్న జ్ఞాపికను కోడెల బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement