‘మోదీతో పోటీ పడుతున్న చంద్రబాబు’ | n raghuveera reddy slams ap govt | Sakshi
Sakshi News home page

‘మోదీతో పోటీ పడుతున్న చంద్రబాబు’

Jan 22 2017 8:02 PM | Updated on Aug 29 2018 6:00 PM

కరువు నివేదికలు పంపకపోవడంతో కేంద్రం నుంచి సహాయం అందడం లేదని రఘువీరారెడ్డి తెలిపారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన సమయంలో కరువు నివేదికలు పంపకపోవడంతో కేంద్రం నుంచి సహాయం అందడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి తెలిపారు. రైతాంగానికి ప్రభుత్వం హాలిడే ప్రకటించిందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీతో పోటీ పడి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

విజయనగరం రైలు ప్రమాద బాధితులకు  రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆయన సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement