నాన్న మాట.. బంగారు బాట..

MVS Boutique Owner Sri Vaishnavi Special Story - Sakshi

విశాఖ సిటీ: వృత్తి అమ్మలాంటిది.. అన్నం పెడుతుంది.. పది మందికి ఉపాధి కల్పించేది వ్యాపారమే అనే సిద్ధాంతం నాన్న చెబుతుంటే విన్న మంచుకొండ శ్రీవైష్ణవి ఆలోచనలు చిన్నతనం నుంచే వ్యాపారం వైపు సాగాయి. ఓవైపు చదువుతూ.. మరోవైపు.. వాణిజ్య రంగంలో రాణించాలన్న ఆమె ఆలోచనలకు నాన్న అప్పలరాజు శ్రీరంగ పెట్టుబడి అందించారు. ఎంబీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతూ.. ఎనిమిది నెలల క్రితం తన సొంత ఆలోచనలతో బొటిక్‌ ప్రారంభించింది.

తన కుటుంబం బ్రాండ్‌ నేమ్‌ ఎంవీఎస్‌ పేరు కలగలిసేలా ఎంవీఎస్‌ 92.5 సిల్వర్‌ బొటిక్‌ పేరుతో బీచ్‌రోడ్డులో తన స్టార్టప్‌ను ప్రారంభించింది. రెగ్యులర్‌ జ్యుయలరీ షాపుల్లో సిల్వర్‌ ఆభరణాలు దొరికినా.. అంతకుమించిన వెరైటీలు, అందరికీ అందుబాటులో ఉండే ధరలతో తన కలల వ్యాపారాన్ని ప్రారంభించిన శ్రీవైష్ణవి.. రెండు నెలల్లోనే ఫేమస్‌ అయిపోయింది. అమ్మాయిల అభిరుచికి అనుగుణంగానూ, భిన్నమైన కుటుంబ సభ్యుల ఆలోచనలను అందుకునేలా వెరైటీలు దొరికే బొటిక్‌గా దూసుకుపోతోంది. అంతే కాదు.. నగరంలో సరైన ఉపాధి లేని స్వర్ణకారులకు ఆసరాగా నిలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top