శ్రీవారికి కానుకగా కల్యాణ రథం | mumbai devotees gifts a chariot to TTD | Sakshi
Sakshi News home page

శ్రీవారికి కానుకగా కల్యాణ రథం

Sep 8 2015 8:18 PM | Updated on Sep 3 2017 9:00 AM

శ్రీవారికి కానుకగా కల్యాణ రథం

శ్రీవారికి కానుకగా కల్యాణ రథం

ముంబైకి చెందిన భక్తులు తిరుమల శ్రీవారికి కల్యాణరథాన్ని మంగళవారం కానుకగా అందించారు.

తిరుమల: ముంబైకి చెందిన భక్తులు తిరుమల శ్రీవారికి కల్యాణరథాన్ని మంగళవారం కానుకగా అందించారు. ముంబైకి చెందిన ఆర్‌కే చెట్టి, టీపీ ముత్తుతోపాటు మరో ఇద్దరు భక్తులు రూ.40 లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేయించారు. తిరుమల ఆలయం వద్ద పూజలు చేయించి వాహనం తాళం చెవిని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ ఈవో సాంబశివరావు, జేఈవో పోలా భాస్కర్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఈవో సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో, నగరాల్లో శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు కల్యాణరథాలు అనుకూలంగా ఉంటాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement