బాబు పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్ యత్నం, అరెస్ట్ | mrps folwers arrested in chittur distirict | Sakshi
Sakshi News home page

బాబు పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్ యత్నం, అరెస్ట్

Feb 24 2015 10:11 AM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుంగనూరు: చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఉదయం పుంగనూరు నుంచి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మిద్ది వెంకటస్వామి సహా 100 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మార్పీఎస్ ఆందోళన నేపధ్యంలో దళితవాడల్లో చెక్కుల పంపిణీ ని అధికారులు నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement