
జేబులో ధనం..వెనుక జనం
ఎన్నికలంటే ఎక్కువగా అంగబలం ఉన్న నాయకులను వెతికి అభ్యర్థిగా అవకాశం కల్పించే వారు.
ఎన్నికలంటే ఎక్కువగా అంగబలం ఉన్న నాయకులను వెతికి అభ్యర్థిగా అవకాశం కల్పించే వారు. కానీ అది పాతపద్ధతి. ప్రస్తుతం రోజులు మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో అంగబలం ఒక్కటే ఉంటే కుదరదని ఆయా పార్టీ నాయకులు తేల్చేసి ‘అర్థ’బలం ఉన్న వారికే సీటు కేటాయించాయి. ఆ ఏముందిలే ఒకటి, రెండు లక్షలు వెచ్చిస్తే ఎంచక్కా కౌన్సిలర్ కావొచ్చని డబ్బున్న అభ్యర్థులు తేలిగ్గా తీసుకున్నారు. కానీ బరిలోకి దిగాక వారికి తెలిసింది ఖర్చు తడిసిమోపెడు అవుతుందని.
నామినేషన్‌కు ముందు రోజు నుంచి చేతిచమురు వదలడం ప్రారంభమైంది. ముందు రోజు రాత్రి మందు, విందుకు డబ్బు వెచ్చించారు. ఇక నామినేషన్ వేసిన రోజు ఆయా వార్డుల్లోని మంది మర్బాలాన్ని వెనకేసుకు వెళ్లడంతో మందు, విందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది. పోటీ అంటే ఏమో అనుకున్నాం గానీ నామినేషన్ రోజుకే రూ. 50వేలకు పైగా ఖర్చు అయ్యాయని ఓ వార్డుకు చెందిన అభ్యర్థి అందరి వద్ద వాపోయారు కూడా. నామినేషన్లు వేయడం, పరిశీలన కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారానికి బయలుదేరారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడమే కదా! అనుకుంటే పొరపాటే. ప్రచారం కోసం ఆయా వార్డుల్లోని తన మద్దతుదారులను వెనకేసుకు వెళ్లాలి. వారికి ఉదయం, మధ్యాహ్నం భోజనంతోపాటు ఓ క్వార్టర్ సీసాకు డబ్బు చెల్లించాలి.
ఇలా ప్రచారం ముగిసేలోపు రూ.2 లక్షల వరకు జేబు ఖాళీ అవుతుందేమోనని అభ్యర్థులు బెంగపడుతున్నారు. ఈనెల 28తో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో ఓటర్లకు ఏర వేసేందుకు అభ్యర్థులు భారీ గానే డబ్బును సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఓటుకు రూ.200 చొప్పున పంచాల్సి వస్తుందని అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు. ఓటర్లు తక్కువగా ఉన్న వార్డుల్లో రూ.3 నుంచి 4 లక్షలు, అత్యధికంగా ఓటర్లు ఉండే వార్డుల్లో 7 లక్షల దాకా పంపిణీ చేయాల్సి వస్తోందని ఓ అంచనా. పట్టణంలో అత్యల్పంగా 20వ వార్డులో 1391 మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా 24వ వార్డులో 3494 మంది ఉన్నారు.
24వ వార్డుకు చెందిన అభ్యర్థులకు అందరి కన్నా చేతిచమురు అధికంగా వదలనుంది. ఇక కొన్ని చోట్ల కొంత మంది అభ్యర్థులు ప్రత్యర్థులు ఎక్కువగా డబ్బు పంచితే వారికన్నా ఎక్కువగా పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో ఎన్నికల గోదాలోకి దిగారు కాబట్టి పరువు కాపాడుకునేందుకు అభ్యర్థులు తాపత్రాయం పడుతూ డబ్బును నీళ్లలా ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయకూడాదని నిర్ణయించుకున్నార