
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ ప్రమాదం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. 10 మంది మృతికి ప్రభుత్వమే బాధ్యత
వహించాలన్నారు. ఎక్కడైనా దుర్ఘటనలు జరిగిన తర్వాతే ప్రభుత్వం హడావిడి చేస్తోందని ధ్వజమెత్తారు. లోకల్ గవర్నెన్స్ ద్వారానే ప్రభుత్వ శాఖలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మైనార్టీల వెనకబాటుతనానికి టీడీపీనే కారణమని మహ్మద్ ఇక్బాల్ ధ్వజమెత్తారు. మైనార్టీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందన్నారు. దేశంలో మైనారిటీ మంత్రిలేని కేబినెట్ టీడీపీ ప్రభుత్వానిదే అని నిప్పులు చెరిగారు. మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘటన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని కొనియాడారు. వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు.